వారాహి రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించింది. వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. వారాహి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించిన విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారాహి వాహనానికి రవాణా శాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధనలు ఉన్నాయని… వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామన్నారు. వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు.