పాపికొండల విహారానికి గ్రీన్ సిగ్నల్
నాలుగు నెలల విరామం తర్వాత నేడు దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి పాపికొండలకు బోట్లు బయలుదేరాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, చలి కాలం ప్రారంభం కానున్న దృష్ట్యా పాపికొండల పర్యటన పునః ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.