భూభారతికి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. తెలంగాణాలో ఇంతవరకూ అమల్లో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఇకపై భూ భారతి చట్టం అమలు కానుంది. త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో కొందరి చేతుల్లోనే ఉన్న రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకూ విస్తరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన గొప్ప విధానమే ఈ భూ భారతి చట్టం అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

