ఏపీలో 662 ప్రధానమంత్రి స్కూల్స్‌కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. ‘ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (PMSRI) అనే ఈ పథకంలో భాగంగా ఈ స్కూళ్లకు కేంద్రప్రభుత్వమే కావలసిన మౌలిక సదుపాయాలను కలుగజేస్తుంది. విద్యార్థులకు క్వాలిటీ విద్య అందించే లక్ష్యంతో కేంద్రం గత సంవత్సరం సెప్టెంబరు 7న ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతీ రాష్ట్రం నుండి కొన్ని స్కూల్స్ ఎంపిక చేస్తారు. ఆ పాఠశాలల మరమ్మత్తులకు, కావలసిన ఫర్నిచర్, కంప్యూటర్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి స్మార్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతారు. ఈ స్కూళ్లకు ఐదేళ్లపాటు నిధులు అందజేస్తారు.

