Home Page SliderTelangana

డీఐజీ అంజనీకుమార్‌కు గొప్ప రిలీఫ్

తెలంగాణ డీఐజీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ తెలంగాణ ఎన్నికల కమీషన్ ఉత్తర్వు జారీ చేయడంతో ఆయనకు గొప్ప రిలీఫ్ లభించింది. ఎన్నికల ఫలితాల రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని, రేవంత్ రెడ్డి పిలిస్తేనే ఆయన ఇంటికి వెళ్లానని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని హామీ ఇచ్చారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన సీఈసీ, ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నేడు ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ తేదీ, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 50 శాతం ఫలితాలు ప్రకటించినప్పటికే బాగా ముందంజలో ఉంది. దీనితో మధ్యాహ్నమే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు డీఐజీ అంజనీకుమార్. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎలక్షన్ కమీషన్ ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.