Andhra PradeshHome Page Slider

మోక్షానికి ధర్మమార్గమే రాచబాట, ఘనంగా ఆరా ఇఫ్తార్ విందు

ప్రఖ్యాత ఆరా ఫౌండేషన్ చిలకలూరిపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఇహపర లోకాల సాఫల్య మార్గంపై బ్రదర్ షఫీచే ఆధ్యాత్మిక సందేశం, ఇఫ్తార్ విందుకు పట్టణంలోని రంజాన్ ఉపవాసమున్న సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్ ముఖ్య అతిధులకు స్వాగతం పలికారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సమీప గ్రామాల నుంచి వేల సంఖ్యలో పాల్గొన్నారు. NRT రోడ్ గోల్కొండ గార్డెన్స్‌లో మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ… ప్రసంగం ఉర్రూతలూగించింది. సర్వమానవ సమానత్వం గురించి షఫీ ఆసక్తికర ఉపన్యాసం చేశారు. కుటుంబ వ్యవస్థలో భార్య, భర్తల అనుసరించాల్సిన ధర్మాన్ని షఫీ వివరించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్‌ను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజేశేఖర్ అభినందించారు.