ఉద్యమాలను తలపిస్తున్న గ్రామ సభలు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నాయి.అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.తమకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేస్తే…మరికొంత మంది అవే ఇళ్ల మంజూరుకు లంచాలు అడుగుతున్నారని గ్రామ సభల సాక్షిగా మాటలతో దునుమాడుతున్నారు.నీళ్లు,రోడ్లు,కాలువలు,వీధిలైట్లు,విద్యుత్ స్థంభాలు,నేలకు ఒరుగుతున్న విద్యుత్ తీగలు, బోర్లు..ఇలా ఒకటా రెండా పదుల కొద్దీ సమస్యలను ఏకరువు పెడుతున్నారు.దీంతో గ్రామ సభల వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో అని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు సైతం సరైన బందోబస్తు కల్పించలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.లగచర్ల లాంటి ఘటనలు జరిగితే ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు,పించన్లు ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం…ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీంతో గ్రామసభలు మినీ ఉద్యమాలను తలపింపజేస్తున్నాయి.