బాలీవుడ్ నటి సన్నీలియోనికి ప్రభుత్వ పథకం…నెలకు రూ.1000
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజీపీ ప్రభుత్వం ‘మహతారీ వందన్ యోజన పథకం’ బాలీవుడ్ నటి సన్నిలియోనికి వర్తించడంపై అధికారులు నివ్వెరపోయారు. ఈ పథకం కింద వివాహిత మహిళలకు ఇచ్చే నెలకు రూ.1000 సన్నిలియోని పేరు ఉన్న ఖాతాలోకి చేరుతోంది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులకు అసలు విషయం తెలిసింది. బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నిలియోని పేరుతో నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచి, ఈ పథకానికి నమోదు చేయించుకున్నాడని తెలిసింది. అలాగే ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఈ పథకం కింద 50 శాతం మంది నకిలీ ఖాతాలతో లబ్ది పొందుతున్నారని ఆరోపించారు.

