ఈనెల 13 ఆఖరి అవకాశం…
గుంటూరు జిల్లాలో 3వేలకు పైగా పాలిటెక్నిక్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిని స్పాట్ అడ్మిషన్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసైనా వారందరూ ఈ నెల 13న ఆయా పాలిటెక్నిక్ కాళాశాలల్లో జరిగే ప్రవేశ ప్రక్రియకు హాజరుకావచ్చన్నారు. అయితే ఆ ఒక్కరోజే స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. దీని తర్వాత ఎటువంటి అడ్మిషన్ ప్రక్రియలు జరపబోయేది లేదన్నారు. కాబట్టి ఆసక్తి ఉన్న విధ్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఈ కోర్సుకు సంబంధించి 7 కళాశాలలు ఉన్నాయి.