Andhra PradeshHome Page Slider

ఏపీలో ఆలయ అర్చకులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఏపీలోని ఆలయ అర్చకులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. కాగా ఏపీలో నెలకు 10 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు  నెలకు రూ.10 వేలు చొప్పున జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాగా దీనిపై త్వరలోనే విధివిధాలను ఖరారు చేసి,ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనిపై ఏపీలోని ఆలయ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.