పాఠశాలలు , కళాశాలలకు సెలవు
పుదుచ్చేరిలో ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు రికార్డు స్ధాయిలో సంభవిస్తున్నాయి. ఇది మూడు దశాబ్దాలలో అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసింది. నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను తరలించడానికి NDRF సహాయక బృందం చర్యలు చేపట్టింది. ఆదివారం భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీనివల్ల బస్సులు డిపోల వద్దే నిలిచిపోయాయి. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా అక్కడి ప్రభుత్వం డిసెంబర్ 2న పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించింది.