3 నెలల కూతురిని కోల్పోయిన గోవింద భార్య సునీత
3 నెలల కుమార్తెను కోల్పోయిన గోవింద భార్య సునీత: ఆమె ఊపిరితిత్తులు డెవలప్ కాలేదు. కూతురిని కోల్పోయిన తర్వాత తన కుమారుడు యశ్వర్ధన్‌ను తాను కంటిక రెప్పలా పెంచానని సునీతా కపూర్ చెప్పారు. ఆమె తన పిల్లలను కేర్ టేకర్స్ సంరక్షణలో పెంచలేదని చెప్పింది. సునీత 1987లో గోవిందను పెళ్లాడింది. సునీత అహూజా కొడుకు యశ్వర్ధన్‌ను తానే పెంచారు. యష్ పుట్టకముందే ఆమె కుమార్తెను కోల్పోయింది. సునీత, గోవిందలకు టీనా అనే మరో కుమార్తె ఉంది. నటుడు గోవిందా భార్య సునీతా కపూర్ ఇటీవల తన పిల్లలను, ముఖ్యంగా తన చిన్న కొడుకు యశ్వర్ధన్‌ను కంటికి రెప్పలా పెంచడం గురించి తెలిపింది. యష్ పుట్టకముందే తనకు ఓ కూతురు ఉందని, అయితే ప్రిమెచ్యూర్‌గా పుట్టడంతో చనిపోయిందని వెల్లడించింది. సునీత, గోవింద దంపతులకు టీనా అనే మరో కుమార్తె ఉంది. అంకిత్‌తో పాడ్‌కాస్ట్ టైమ్‌ఔట్ సమయంలో, సునీత తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టలేదని వెల్లడించింది. టీనా, యష్‌ల మధ్యనే ఉంటూ, వారికి కావలసినవన్నీ చూస్తూ, ఆమె యష్ అడిగినవన్నీ లేదనకుండా కోరినవన్నీ ఇస్తూ ఉండేది. యష్ టీనా కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కాబట్టి కొంచెం అల్లారుముద్దుగా పెరిగాడు. యష్ కంటే ముందు, నాకు మరొక కుమార్తె కూడా ఉంది, ఆమె మూడు నెలల వయసులో మృతి చెందింది; ఆమె ఊపిరితిత్తులు డెవలప్ కాలేదు. అందుకే యశ్‌ను జాగ్రత్తగా పెంచాను. ఇప్పుడు నేను అతని కోరికలన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది అని పోడ్‌కాస్ట్ టైమ్‌లో సునీత చెప్పారు.
తన పిల్లలను స్కూల్ నుండి తీసుకురావడం, తీసుకెళ్లడం అన్ని తనే చూసుకునేది. నేను ఎప్పుడూ నా పిల్లలను కేర్ టేకర్స్ వద్ద వదలలేదు, అని సునీత చెప్పింది, టీనా, యష్ ఇద్దరూ ఇప్పుడు పెద్దవారైనప్పటికీ, ఆమె ఇద్దరినీ చాలా క్రమశిక్షణతో పెంచుతోంది. సునీత 1987లో బాలీవుడ్ హీరో నెం. 1 గోవిందను 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. వారికి పెళ్లైన ఏడాది తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అతను విరార్ నుండి, నేను పాలి హిల్ నుండి వచ్చాము. మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఎవరు ఊహించారు? అని సునీత అన్నారు. సునీత, గోవిందలు తమ పెళ్లిని ఏడాది పాటు సీక్రెట్‌గా ఉంచారు. ఇంతకుముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గోవింద దీనిని “లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్” అని అభివర్ణించారు, వారి పెళ్లైన మొదట్లో ఇద్దరూ తరచుగా గొడవలుపడేవారమని చెప్పుకొచ్చారు.

