Home Page SliderPoliticsTelanganatelangana,Trending Today

తెలంగాణ తల్లికి గవర్నర్ ఆమోదం..ప్రత్యేక జీవో జారీ..

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ‌వర్మ తెలంగాణ తల్లి విగ్రహంపై ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేశారు. ఈ విగ్రహాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలలో, కలెక్టర్ ఆఫీసులలో విగ్రహాలు పెట్టాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అన్నారు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల వంటిదన్నారు. మెడలో కంటె, గుండుపూసల హారంతో, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని తయారు చేయించామన్నారు.