Home Page SliderTelangana

వరంగల్ ముంపు ప్రాంతాలలో గవర్నర్ తమిళి సై పర్యటన

భారీ వర్షాలు కారణంగా ప్రాజెక్టులు పొంగి, ముంపు ఏర్పడిన వరంగల్‌ జిల్లాలో తెలంగాణ గవర్నర్ తమిళి సై పర్యటన చేస్తున్నారు. అక్కడి ముంపు ప్రాంతాలను సందర్శించి, నివారణ చర్యలను పర్యవేక్షించారు. వరంగల్ జవహర్ నగర్ కాలనీని సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలను అరికట్టలేమని, కానీ వాటివల్ల వచ్చే ప్రమాదాన్ని కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా తగ్గించగలమని పేర్కొన్నారు. స్థానిక నేతలు, అధికారులు పని చేస్తున్నారని, కానీ ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా చేయాలని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఎన్నోసార్లు బ్రిడ్జి కోసం అప్పీలు చేసుకున్నామని, చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారానికి ఏదైనా చేయాలని, ఇక్కడి ప్రజలు వర్షాల కారణంగా ప్రతీ సంవత్సరం ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.