Home Page SliderTelangana

తెలంగాణా రాష్ట్ర పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై స్పందన

ఎట్టకేలకు గత ఆరునెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులలో మూడింటిని ఆమోదించారు తెలంగాణా గవర్నర్ తమిళిసై. తెలంగాణా ప్రభుత్వం గత నెలలో సుప్రీంకోర్టులో ఈ పెండింగ్ బిల్లుల విషయంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం సెప్టెంబరు నుండి ఫిబ్రవరి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు వాటిలో మూడు ఆమెదించారు. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కొరకు  పంపారు. మరొక రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఇంకో రెండు బిల్లులను ఇంకా పెండింగ్‌లోనే ఉంచినట్లు సమాచారం. గత కొంతకాలంగా రాష్ట్రప్రభుత్వం, గవర్నర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. శాసన సభ ఆమోదించి పంపిన బిల్లులను ఇలా ఏసమాధానం లేకుండా నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం శాసనసభ అధికారాలను రద్దు చేయడమేనంటూ తెలంగాణా ప్రభుత్వం కోర్టుకెక్కింది.