Home Page SliderTelangana

తెలంగాణ వరదలపై గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు

తెలంగాణలోని వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడిన కష్టాలు తనకెంతో బాధ కలిగించాయని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొన్నారు. త్వరలోనే వరదబాధిత ప్రాంతాలలో పర్యటిస్తానని తెలియజేశారు. ఈ వర్షాలు, వరదలు, ప్రాజెక్టుల ముంపుపై రాష్ట్రప్రభుత్వ నివేదికను అడిగామని, అది రాగానే కేంద్రప్రభుత్వానికి పంపుతామని, తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజల ఇబ్బందులు చూస్తే చాలా బాధ కలిగిందని, ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల సహాయం చేయాలని, రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని గవర్నర్ తెలిపారు. ప్రజాప్రతినిధులు ఏ పార్టీలకు చెందిన వారైనా ప్రజలకు అండగా ఉండాలని కోరారు.