Andhra PradeshHome Page Slider

టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు

కేంద్రంలో బలంగా ఉన్న టీడీపీ పార్టీకి మరో కొత్త లాభం చేకూరే అవకాశం వచ్చింది. టీడీపీ నేతలకు ఎన్డీఏ కూటమి తరపున రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం వినిపిస్తోంది. వీరిలో యనమల రామకృష్ణుడు, అశోకగజపతిరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరో టీడీపీ ముఖ్యనేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక చీఫ్ విప్‌గా దూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. వీరందరూ కూడా మంత్రి పదవులు ఆశించారు. అవి దక్కకపోవడంతో వీరికి ఈ ప్రతిష్టాత్మక పదవులు దక్కే అవకాశం ఉంది.