Andhra PradeshHome Page Slider

ఏపీ సీఎంను కలిసిన తెలంగాణా గవర్నర్

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ రోజు ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు,పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉండవల్లికి చేరుకున్నగవర్నర్‌కు ఏపీ ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ స్వాగతం పలికారు.