గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ మేరకు గవర్నర్‌ను భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి శనివారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్ర భవిష్యత్ దిశను సూచించే ఈ కీలక కార్యక్రమానికి గవర్నర్ హాజరు కావడం రాష్ట్రానికి ప్రేరణ కలిగిస్తుందని భట్టి పేర్కొన్నారు. సమ్మిట్‌లో నీతి ఆయోగ్, ఐఎస్‌బీ సూచనలతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. డిసెంబర్ 8న మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ప్రసంగం ఇవ్వనున్నారని, 9న సాయంత్రం 6 గంటలకు సదస్సు ముగుస్తుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

