ఏపీలో ఏర్పడే ప్రభుత్వం… తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనుమడు పుట్టువెంట్రుకలు తీయించేందుకు నిన్న రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.