‘ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణసంకటం’..వైసీపీ
సింహాచలంలో గోడ ప్రమాదం ఘటనపై ఏపీ ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణసంకటంగా మారిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. గురువారం సింహాచలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్ కూడా ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడ నిర్మాణంలో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైసీపీ బృందం సింహాచలంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్స్ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు.