Home Page SliderNational

మణిపూర్‌కు చేయి అందించిన తమిళనాడు ప్రభుత్వం

మణిపూర్‌లో గతకొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ హింస తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. దీంతో మణిపూర్‌లో ఎన్నో వేలమంది నిరాశ్రయులు అయ్యి.. సహాయక శిబిరాల్లో నివాసముంటున్నారు.  ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మంచి మనసు చాటుకుని అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మణిపూర్‌లోని సహాయక శిబిరాల్లో ఉంటున్న దాదాపు 50 వేలమందికి పైగా ప్రజలకు సహాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సహాయక  శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు రూ.10కోట్ల విలువైన సామాగ్రిని పంపిస్తున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ మణిపూర్ సీఎం బీరెన్ సింగ్‌కు లేఖ రాశారు.