సౌర విద్యుత్ ప్లాంట్లకు సర్కారు ప్రోత్సాహం
హైదరాబాద్: పొలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, పెద్ద పెద్ద చెరువుల్లో కూడా తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లను నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా కేంద్రం అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన కరెంటును సౌర విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసుమ్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.

