రోబోట్లను కూడా వదలని లేఆఫ్- గూగుల్ వింత నిర్ణయం
ఆర్థిక మాంద్య భయంతో గూగుల్ సంస్థ ఇప్పటికే ఎంతో మందిని తొలగించింది. ఇప్పుడు ‘ఎవ్రీడే రోబోట్స్’ పేరుతో పూర్వం ప్రారంభించిన ప్రాజెక్టును కొనసాగించరాదనే నిర్ణయానికి వచ్చింది. ఒక చేయి, వీల్స్ కలిగిన ‘ఎవ్రీడే రోబోట్స్’ గూగుల్ కేఫ్‌టేరియాలలో టేబుల్స్ తుడవడానికి, చెత్తను రీసైకిల్ చేయడానికి, తలుపులు తెరవడానికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2019లో ప్రారంభించారు. తర్వాత కరోనా కాలంలో ఇవి చాలా బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు వీటి నిర్వహణ ఖర్చులు తట్టుకోలేక ఈ ప్రాజెక్టును అర్థాంతరంగా నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కోసం వినియోగించిన సాంకేతికతను, టీమ్‌ను గూగుల్ రీసెర్చిలో ఉన్న వేరే రోబోటిక్ ప్రాజెక్టులో విలీనం చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ 12 వేల మందిని తొలగించింది.

