‘పవన్ ఇంకా గుడ్‌బాయే’- పోసాని
పవన్ కళ్యాణ్ ఇంకా తన దృష్టిలో గుడ్‌బాయేనని వ్యాఖ్యానించారు విలక్షణ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. జగన్ పైన ద్వేషం పక్కనపెట్టి నిజానిజాలు గుర్తించాలని పవన్‌కు సూచించారు. చంద్రబాబు రాసిన స్ట్రిప్టు చదువుతూ టైం వేస్టు చేసుకుంటే ఎప్పటికీ సీఎం కాదుకదా, ఎమ్మెల్యేవి కూడా కాలేవన్నారు. టీడీపీ వాళ్లు పవన్‌ను గెలవనివ్వరని ఎద్దేవా చేశారు. వారి దృష్టిలో చేపను పట్టడానికి వాడే వానపాము ఎర లాంటి వాడే పవన్ అన్నారు. పవన్‌ను వాడుకుని, జగన్‌ను ఓడించాలని చంద్రబాబు అనుకుంటున్నారని, పవన్‌ను వాడుకుని వదిలేస్తారన్నారు. ఇప్పటికైనా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని, చంద్రబాబు వలలో పడొద్దని సలహా ఇచ్చారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తొందరపాటు వల్ల చిరంజీవి చాలామందికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు.