Home Page SliderTelangana

తెలంగాణా ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణా ప్రజలకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై భారీ ఊరట కల్పించనుంది. వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల విద్యుత్ భారం పడకుండా  సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల  ట్రూఅప్ ఛార్జీలు రూ. 12,718 కోట్లను ప్రభుత్వమే విద్యుత్ నియంత్రణ మండలికి చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా 5 ఏళ్లలో డిస్కంలకు ప్రభుత్వమే ఈ డబ్బు చెల్లిస్తోంది. అయితే ఇప్పడు దీనిపై పడిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. అలాగే ప్రార్థనా స్థలాలకు అందించే విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ.5/- చొప్పున మాత్రమే ఇకపై వసూలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.