InternationalNews

ఉక్రెయిన్ నుండి వచ్చిన ‘మెడికోస్‌’కు గుడ్‌న్యూస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి MBBS చదువుతూ మధ్యలో వచ్చేసిన మెడికల్ స్టూడెంట్స్‌కు కేంద్రం తీపి కబురునందించింది. వారు పరీక్షలు భారత్ నుండే రాసేందుకు అవకాశం లభించింది. సుప్రీం కోర్టులో విద్యార్థుల తరపున అఫిడవిట్ వేసింది కేంద్రం. వారి చదువు మధ్యలో ఆగిపోకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు పరీక్షలు రాసేందుకు అనుమతిని కోరింది. వారు ఫైనల్ పరీక్షలు భారత దేశంలోనే రాసేందుకు అనుమతి లభించింది. ఒకే సంవత్సరంలో థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.