Home Page SliderNational

టోల్‌గేట్ విషయంలో ప్రయాణికులకు శుభవార్త

టోల్‌గేట్ దగ్గరలో 60 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు ఉండే వ్యక్తులకు శుభవార్త. మీ ఇంటి నుండి 60 కి.మీ దూరంలో ఉన్న ఏ టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించబడదు. దాని కోసం మీరు మీ ఆధార్ కార్డు ద్వారా పాస్ చేయాలి.  ఆధార్ కార్డ్‌తో పాస్ తీసుకుని, ఆ టోల్ గేటును ఈజీగా దాటిపోవచ్చు. దీనిద్వారా చాలామంది ప్రజలకు లబ్ది చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ నేడు ధృవపరిచారు.