Andhra PradeshHome Page Slider

ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి గుడ్‌న్యూస్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో  పాల్గొన్న అధికారులు,ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. కాగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారందరికీ గౌరవ వేతనం లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక నెల గరిష్ఠ వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర  ఎన్నికల కమీషనర్ ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు,ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.