నిరుద్యోగులకు శుభవార్త
ఇండియన్ రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 32,438 గ్రూప్-డీ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వెల్లడించినున్నట్లు సమాచారం. వీటిలో అత్యధికంగా 13,187 ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత పాయింట్స్ మెన్ 5058, అసిస్టెంట్ 3077 సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులవుతారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.rrbcdg.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాలి. 18 నుంచి 36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది.

