Home Page SliderTelangana

తెలుగు ప్రజలకు శుభవార్త.. భారత్ గౌరవ్ రైలు ప్రారంభం

 మీరు కాశీ వెళ్లాలనుకుంటున్నారా?  వెళ్లే దారిలో కోణార్క్, పూరీ కూడా చూడాలా  అయితే భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్ టికెట్ తీసుకోండి. మీరు సికింద్రాబాద్ స్టేషన్‌లో బయలుదేరినప్పటి  నుండి తిరిగి సికింద్రాబాద్ చేరుకునేవరకు మీకు IRCTC తోడుంటుంది. ఈ ట్రైన్‌లో పూరి,కాశి,కోణార్క, అయోధ్య,ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలకు ఏడు రాత్రులు,8 పగళ్లు కలిసి ఈ ప్రయాణం ఉంటుంది. ఈ ట్రైన్‌లో ఏసీ, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఈ ట్రైన్‌లో గంగా పుష్కరాలు చూడడానికి కూడా అవకాశం ఉంది. ఈ టికెట్ ధరలోనే వసతి, క్యాటరింగ్, రోడ్డుప్రయాణం, దర్శనాలు కూడా వస్తాయి.

ఈ ట్రైన్‌లు సీజన్, డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి రైళ్లను పంపిస్తామని, భారత్‌లోని వివిధ పుణ్యక్షేత్రాలకు ఇలాంటి ట్రైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరభారత దేశ యాత్రే కాకుండా, దక్షిణ దేశయాత్రను కూడా ఏర్పాటు చేస్తారన్నారు. టికెట్టు ధరలు ఏసీ 2 టైర్, 3 టైర్‌కు ఒక్కొక్కరికీ 30 వేల రూపాయల వరకు ఉంటుంది. స్లీపర్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఏసీ కోచ్‌వారికి హోటల్‌లో ఏసీ రూములు, బస్సుల్లో ఏసీ బస్సులు కేటాయిస్తారు. టిఫిన్లు, భోజనాలు మాత్రం అందరికీ సమానంగానే ఉంటాయని అధికారులు తెలియజేశారు.