తెలుగు ప్రేక్షకులకు శుభవార్త
బాలీవుడ్ బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టస్తున్నఛావా చిత్రాన్ని తమ భాషలో కూడా రిలీజ్ చేయాలంటూ ప్రేక్షకుల నుండి డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ శుభవార్త చెప్పింది. వారి కోరిక తీర్చే బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ తీసుకుంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుండి ఛావా తెలుగు వెర్షన్ థియేటర్లలో వీక్షించవచ్చని వెల్లడించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభూజీ మహరాజ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన భార్య ఏసుబాయి పాత్రలో అందాల తార రష్మిక నటించారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలలో విక్కీ చాలా శ్రమ పడ్డారని, భావోద్వేగానికి గురయ్యారని చిత్రబృందం తెలిపింది.