Home Page SliderTelangana

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

తెలంగాణా సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అదేంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్‌ను 30% పెంచుతున్నట్లు తెలిపింది. కాగా రాష్ట్రంలో బదిలీలపై వెళ్లే ఉద్యోగులకు ఈ అలవెన్స్‌ను అమలు పర్చనున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్సులను రూ.20 లక్షల నుంచి రూ.30లక్షల వరకు పెంచుతున్నట్లు తెలంగాణా సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా కారు కొనుగోలు చేసే ఉద్యోగులకు అడ్వాన్స్ రూ.6లక్షల నుంచి రూ.9లక్షలకు పెంచింది. బైక్ కొనుగోలు చేసే ఉద్యోగులకు అడ్వాన్స్ రూ.80వేల నుంచి రూ.లక్ష కు పెంచుతున్నట్లు తెలంగాణా సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.