NationalNews Alert

TCS ఉద్యోగులకు తీపి కబురు

TCS సంస్థ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్తోంది. ఏమంటే మొదటి క్వాటర్‌లో 100శాతం వేరియబుల్ వేతనాన్ని అందిస్తోంది. దేశంలోని ప్రముఖకంపెనీలన్నీ ఈ విషయంలో ఉద్యోగులకు కొంత షాకివ్వగా టీసీఎస్ మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తోంది. కంపెనీ పెర్ఫామెన్స్ మరియు ఉద్యోగి పెర్ఫామెన్స్ ప్రకారం ఈ వేరియబుల్ పే ను నిర్ణయిస్తారు. మార్జన్‌లపై ఒత్తిడులు, సప్లై చెయిన్ సమస్యలు, టెక్నాలజీలో పెట్టుబడుల కారణంగా విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఈ వేతనాన్ని తగ్గించడమో, ఆలస్యం చేయడమో జరుగుతూ ఉంటుంది. ఈమధ్య విప్రో సి-సూట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వేరియబుల్ పేని నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఫ్రెషర్స్ నుండి టీమ్ లీడర్ల వరకూ కూడా ఈ వేరియబుల్ పేలో 70 శాతం మాత్రమే పొందనున్నారు. అయితే టీసీఎస్ మాత్రం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మార్చి-జూన్ క్వాటర్‌లో సీ3ఏ, సీ3హీ, సీ4, ఉద్యోగులకు ఈ చెల్లింపులో ఆలస్యం చేయలేదని తెలిపారు.