ST విద్యార్థులకు శుభవార్త..
ఏపీలోని అనంతపురం జిల్లా గుత్త మండలంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఎస్టీ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5, 6, 9వ తరగతులకు బ్యాక్‌లాగ్ ఖాళీ సీట్లు ఉన్నాయని, ప్రవేశాల కోసం దరకాస్తులు చేసుకోవాలని సూచించింది. ఎస్టీకి 78 శాతం, ఎస్సీకి 12 శాతం, బీసీ 5 శాతం, ఓసీ 2 శాతం, ఇతరులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తామని సూచించింది. ఆన్‌లైన్ ద్వారా దరకాస్తులకు ఆఖరు తేదీ మార్చి 25. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


