Home Page SliderNationalPolitics

ఢిల్లీ సీనియర్ సిటిజన్స్‌కు శుభవార్త..

ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లకు ఆమ్ ఆద్మీ పార్టీ శుభవార్త చెప్పింది. ఢిల్లీలో 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించేలా సంజీవని యోజన అమలు చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పైగా వారి చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ట పరిమితి ఏమీ ఉండదని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇది కీలక హామీగా మారింది. వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రాగానే ఈ ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆప్ కార్యకర్తలే ఇళ్లకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని పేర్కొన్నారు. వారు ఒక హెల్త్ కార్డు ఇస్తారని, దానిని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే 70 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుండి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత సీఎం ఆతిశీ కల్కాజీ నుండి పోటీ చేస్తున్నారు.