ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
భారత్‌లో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. అమృతకలశ్ పేరుతో ఉన్న తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ పథకం గడువు ఈ నెల డిసెంబర్ 31తో ముగుస్తుండగా, దీనిని 2024 మార్చి 31 వరకూ పెంచింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై టీడీఎస్ ఉంటుంది. దీనిప్రకారం సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తోంది. రూ.2 కోట్ల వరకూ ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్వల్పకాలిక మొత్తాలకు కూడా ఈ డిపాజిట్ వాడుకోవచ్చు. ముందుగా ఉపసంహరించుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంది. ఇతర పథకాల వడ్డీ రేట్లను కూడా 50 బేసిక్ పాయింట్లు పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి నుండే అమలులోకి రానున్నాయి.


