Home Page SliderNational

సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్

సంక్రాంతి పండుగకు మీ సొంతఊరు వెళుతున్నారా? అయితే రైల్వేశాఖ మనకు గుడ్ న్యూస్ తెలియజేస్తోంది. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధ్వర్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. జనవరి 5 నుండి ఫిబ్రవరి 1 వరకూ ఈ టైమ్ టేబుల్ పని చేస్తుందని, ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా పలు రైళ్లను స్టేషన్లు కూడా పొడిగించారని తెలియజేశారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు. తిరుపతి -ఆకోలా, పూర్ణ- తిరుపతి, హైదరాబాద్-నరసాపూర్, తిరుపతి- సికింద్రాబాద్, కాకినాడ- లింగంపల్లి వంటి రైళ్లు జనవరి 5వ తేదీ నుండి ఫిబ్రవరి 2 వరకూ కొన్ని రోజులలో నడవబోతున్నాయి.