accidentHome Page SliderNationalNews

రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్‌న్యూస్..

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇలాంటి ప్రమాదాలలో గాయపడిన వారికోసం ప్రత్యేక వైద్య సౌకర్యాన్ని కలిగించింది. రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించాలంటూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ఏడాది క్రితమే సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అది ఇంతవరకూ అమలు కాకపోవడంతో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అమలు చేయకపోతే సంబంధిత అధికారులకు కోర్టు ధిక్కరణ కింద శిక్ష వేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి కేంద్రం “క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025″గా నామకరణం చేసింది. ప్రమాదం జరిగిన నాటి నుండి ఏడు రోజుల దాకా ఈ సేవలను పొందవచ్చు. బాధితుడు డిశ్చార్జ్ అయిన వెంటనే వైద్య సేవలు అందించిన ఆసుపత్రి బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ సేవలకు గాను ఆసుపత్రులు ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతాయి.