రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..
రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్నవారికి రేషన్ కార్డు ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులతో పాటు నిత్యావరసర సరుకులు అందించేవారు. ఇకపై రేషన్ షాపులో జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇకపై రేషన్ దుకాణాల్లో విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్రం తెలిపింది. నిత్యావసరాల సహా మొత్తం 3500 ఉత్పత్తులతోపాటు రోజువారీ పాల ఉత్పత్తులు కూడా విక్రయించనున్నట్లు వెల్లడించింది. లబ్దిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. తొలుత తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై రెండు తెలుగు రాష్ట్రాలు కసరత్తులు మొదలు పెట్టాయి. అతి త్వరలో రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానుంది.