Home Page SliderNational

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో  ఎదురు చూస్తోన్న “కల్కి 2898 AD” మూవీ ట్రైలర్ మరి కొన్ని గంటల్లోనే విడుదల కాబోతుంది. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో మూవీ ట్రైలర్ విడుదల కానుంది. అంతేకాకుండా దేశంలోని పలు థియేటర్లలో కూడా కల్కి మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కల్కి మూవీ ప్రమోషన్స్‌లో హీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు.కాగా ఈ సినిమాలో  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.అయితే ఇటీవల జరిగిన కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ బుజ్జిని పరిచయం చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు.