Home Page SliderNational

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్న “సలార్” సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ‌ను మరింత సంతోష పెట్టేందుకు దర్శక ధీరుడు రాజమౌళి “సలార్” టీమ్‌తో చేసిన ఇంటర్వ్యూను తాజాగా విడుదల చేశారు. కాగా సలార్ సినిమా ప్రమోషన్స్‌లో వెనుకబడిందనే విమర్శలకు చెక్ పెట్టేందుకు మేకర్స్ ఈ ఇంటర్య్వూను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ,షూటింగ్ సమయంలో జరిగిన ఇంట్రెస్టింగ్ సన్నివేశాల గురించి రాజమౌళి సలార్ టీమ్‌ను ప్రశ్నించారు.కాగా ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ,హీరో ప్రభాస్,విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.