Home Page SliderNationalNews Alert

పీఎంయూవై లబ్దిదారులకు కేంద్రం శుభవార్త

పీఎంయూవై లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వంట గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం అందుకుంటున్న సబ్సిడీని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదిలో 12 సిలిండర్లను సబ్సిడీతో పొందవచ్చని, ఈ సబ్సిడీ మొత్తం 200 నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నిర్ణయంతో దేశంలోని 9.5 కోట్ల మంది ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది. సబ్సిడీ పొడిగించడం వల్ల ప్రభుత్వంపై 7,680 కోట్ల భారం కేంద్రంపై పడనుంది.