తెలుగు రాష్ట్రాల్లో ఫార్మాసిస్టులకు శుభవార్త..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఫార్మాసిస్టులకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఒక సంస్థ. తెలుగు రాష్ట్రాలలో ప్రతీ జిల్లాలో వైద్య సదుపాయాన్ని సామాన్య ప్రజలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మ్యాక్ ఫార్మా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు లీజుకు తీసుకుని, మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తోంది. అపోలో, మెడిప్లస్ తరహాలో పలు ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో శ్రీకాకుళం నుండి తిరుపతి వరకూ ఈ షాపులు ఉంటాయి. అలాగే తెలంగాణలో కూడా హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలో ఈ షాపులు నిర్వహించడానికి అర్హులు కావాలని ప్రకటన ఇచ్చారు. పలువురు డెలివరీ బాయ్స్, ఫార్మాసిస్టులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగాలలో అనుభవం ఉన్నవారు ఈ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
