Home Page SlidermoviesNationalNews AlertTrending Today

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుండి మంచి అప్‌డేట్ విడుదలయ్యింది. ఈ చిత్రం నుండి ‘మాట వినాలి’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ఆస్కార్ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందించారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మొదట కొన్నాళ్లు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొనసాగగా, ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ‘వీరమల్లు మాట చెబితే వినాలి’.. అంటూ తెలంగాణ యాసలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్టైల్‌లో సాగుతున్న లిరిక్స్‌ ఆకట్టుకుంటూ.. అభిమానులను థ్రిల్‌ చేస్తున్నాయి. పెంచల్ దాస్ రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజిషన్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాడాడు. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్‌ ఖేర్‌, అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాని ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.