Home Page SliderNational

జూనియర్ NTR ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందుకున్న తర్వాత వస్తున్న మొదటి చిత్రం NTR30.ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు NTR30 సినిమా  ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా రేపు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా..NTR30 ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేయనుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ లుక్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. కాగా NTR30 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, టాప్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.