ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
తెలుగు రాష్ట్రాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణలోని ఇంటర్ బోర్డులు ఇంటర్ సిలబస్ తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. సీబీఎస్‌సీ సిలబస్‌లో కూడా ఇప్పటికే 30 శాతం సిలబస్‌ను 9వ తరగతి నుండి 12వ తరగతి వరకూ తగ్గించారు. అదే బాటలో ఇంటర్ సిలబస్‌ను కూడా తగ్గించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థులపై అధిక ఒత్తిడిని తగ్గించాలని, సిలబస్‌లో మార్పులు చేశారు. గణితంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు పేపర్ల పద్దతి స్థానంలో సిలబస్ తగ్గించాక రెండు పేపర్ల విధానం ఉంచాలా తగ్గించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. అలాగే బైపీసీలో కూడా సీబీఎస్‌సీ విధానంలో బయాలజీ ఒక్కటే ఉంది. రాష్ట్రంలో జంతు శాస్త్రం, వృక్షశాస్త్రంగా విభజింపబడ్డాయి. దీనితో విద్యార్థులు నీట్‌కు చదవడానికి వేర్వేరు విధానాలు పాటించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర విద్యామండలి కూడా జాతీయ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్ పరీక్షలలో ప్రతిభ కనపరచడానికి అవకాశం ఉంటుంది.