Home Page Sliderhome page sliderTelangana

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త

హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ (1800 599 5991), హెల్ప్ డెస్క్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ, ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు తమ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఆధారంగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి త్వరిత పరిష్కారం అందిస్తామని చెప్పారు. ప్రధానంగా బిల్లులు జమ కాకపోవడం, సిబ్బంది ఫోటోలు అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం, సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుంది. ఇందిరమ్మ పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడు AI టెక్నాలజీ వినియోగం మరింత పెరిగిందని అన్నారు. అవినీతికి తావు లేకుండా, పేదలకు ₹5 లక్షల సబ్సిడీతో ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.