Home Page SliderNational

భారత్ అభిమానులకు శుభవార్త..’గిల్’ ఈజ్ బ్యాక్

భారత్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ అహ్మదాబాద్‌లో జరగబోయే మ్యాచ్‌కు సిద్దమవుతున్నాడు. పాకిస్థాన్‌తో జరగబోయే ప్రపంచకప్ మ్యాచ్‌లో గిల్ పాల్గొంటున్నారనే వార్తతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో ప్రపంచ కప్ మ్యాచ్‌లకు గిల్ దూరమైన సంగతి మనకు తెలిసిందే. ప్లేటెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువయిపోవడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు పరిస్థితి మెరుగవడంతో సోమవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యాడు. అహ్మదాబాద్ పిచ్‌పై గిల్‌కు మంచి పట్టు ఉండడంతో ఈ సారి పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధిస్తుందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. నేడు టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతోంది.