భారత్‌కు శుభవార్త..అసీస్‌కు షాక్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ బౌలర్లు శుభారంభం చేశారు. తొలి టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే భారత అభిమానులు సంతోషించేలా బౌలర్లు చెలరేగుతున్నారు. దీనితో ఆస్ట్రేలియా 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను 8 పరుగులకే ఔట్ చేశారు బుమ్రా. తన మ్యాజిక్ బౌలింగ్‌తో మరో రెండు వికెట్లు తీశారు. మిచెల్ మార్ష్ 6 పరుగులు, ట్రావిస్ హెడ్ 11 పరుగులు , స్మిత్ డకౌట్ కాగా, ఓపెనర్ స్వీనీ 10 పరుగులతో ఔటయ్యారు.

